మన లైఫ్ లో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు చాలా చాలా ఇబ్బందికరంగా బాధపెడుతూ ఉంటాయి . అటు మింగలేము ఇటు కక్కలేము అన్న పొజిషన్ ని క్రియేట్ చేస్తాయి . ప్రెసెంట్ అలాంటి పొజిషన్లో ఉండిపోయాడు మెగా హీరో వరుణ్ తేజ్ . మెగా బ్రదర్ నాగబాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ చాలా డిఫరెంట్ సినిమాలను చూస్ చేసుకుంటాడు అన్న పేరు ఎప్పటినుంచో ఉంది . మరీ ముఖ్యంగా మెగా హీరోలు అందరూ ఎప్పుడు ఒకే జోనర్ సినిమాలను చూస్ చేసుకుంటూ ఉంటే .. వరుణ్ తేజ్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న కంటెంట్ ని చూస్ చేసుకుంటాడు అని మెగా అభిమానులు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు .
కాగా వరుణ్ తేజ్ ఇప్పుడు టాప్ సిచువేషన్ ని ఫేస్ చేస్తున్నాడు . వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . పెళ్లికి ముందు చేసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన పెద్దగా ఆయన పట్టించుకోలేదు . అయితే పెళ్లి తర్వాత చేసిన సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో అందరూ ఇప్పుడు ఆయన భార్యపైనే వేలు ఎత్తి చూపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి వరుణ్ లైఫ్ లో ఐరన్ లెగ్ గా మారింది అని ..అందుకే ఆయనకు హిట్స్ పడడం లేదు అని ట్రోల్ చేస్తున్నారు.
అంతేకాదు ఇలాంటి సిచువేషన్ గతంలో తారక్ కూడా ఫేస్ చేశారు . తారక్ .. లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడుతూనే వచ్చాయి . ఆ టైంలో అందరూ లక్ష్మి ప్రణతిని నెగిటివ్గా వేలెత్తి చూపించారు . అయితే ఎవరు ఊహించని రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అవుతూ క్రేజీ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారాడు . వరుణ్ తేజ్ కూడా అంతే స్టార్టింగ్ లో కొంచెం అటు ఇటు ఉన్న ఫ్యూచర్లో మంచి స్థానాన్ని అందుకుంటాడు అంటూ మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఒకప్పుడు తారక్ .. లక్ష్మి కారణంగా ఎలా ట్రోలింగ్ ఫేస్ చేశాడో.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కారణంగా వరుణ్ తేజ్ కూడా అదే ట్రోల్లింగ్ ఫేస్ చేస్తున్నాడు..!!