మీరా చోప్రా మాట్లాడుతూ తనకు ప్రియాంక చోప్రా కూడా దగ్గర బంధువు అవుతుంది.. అయినా కూడా అవకాశాల కోసం తాను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తమ కుటుంబం మధ్యతరగతి కుటుంబమని.. ప్రియాంక చోప్రా సినిమాలలోకి రావడం వల్ల తనకి కూడా ఇండస్ట్రీ పైన చాలా ఆసక్తి పెరిగింది అని అలా 2005లో అన్బ్ ఆరుయిరే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా దాదాపుగా తన సినీ కెరియర్ లో 25 సినిమాలలో నటించానని.. అయినప్పటికీ కూడా దక్షిణాదిలో తనకు ఇష్టం లేకపోయినా నటించానని ఎందుకంటే తనకు భాషపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది మీరా చోప్రా.
కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయంలో తనకు అవకాశాల విషయంలో ఎన్నో సవాళ్లు సైతం ఎదురయ్యాయని ఆఫర్స్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలో తనకి అర్థం కావడం లేదని.. కొంత మంది అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చిన తర్వాత మళ్లీ వేరే వాళ్ళను తమ సినిమాలలో తీసుకునేవారని.. ఇలా ఎన్నో విషయాల వల్ల తాను తన జీవితంలో చాలా సఫర్ అయ్యానని తెలిపింది.. అయితే ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా తనకు అవకాశాల విషయంలో ఎక్కడ కూడా హెల్ప్ అడగలేదని.. కేవలం తన స్వయంకృషితోనే అవకాశాలు సంపాదించుకోవాలని చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపింది మీరా చోప్రా.