మనం అనేక సినిమాల్లో , అలాగే సోషల్ మీడియాలో ముద్దుల గురించి అనేక విషయాలను వింటూ ఉంటాం. కొంత మంది ప్రేమించుకున్న వ్యక్తులు ముద్దులు పెట్టుకోవడం ద్వారా ఎంతో రిలాక్స్ అవుతారు అని , అలాగే ఆ జంట మధ్య ప్రేమ కూడా మరింత పెరుగుతుంది అని ఇలా రకరకాలుగా ముద్దుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అని తెలియజెప్పే వీడియోలు ఎన్నో మన ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే వీటిపై అధ్యయనాలు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నట్లే చెబుతున్నాయి. మరి ముద్దుల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అలాంటి విషయాలను తెలుసుకుందాం.

ప్రేమించుకున్న వ్యక్తులు కిస్ పెట్టుకోవడం , హగ్ చేసుకోవడం , ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం ఇలా చేయడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంటాయి అని తెలుస్తుంది. ఇలా శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల కావడం అనేక మంచి పరిణామాలకు దారితీస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ముద్దులతో శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముద్దులు పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా చాలా చక్కగా ఉంటుంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముద్దులు పెట్టుకోవడం వల్ల దంతాలు కూడా చాలా బాగుంటాయి అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ముద్దులు పెట్టుకునే ప్రక్రియలో ఒకరి లాలాజలం మరొకరి లోపలికి వెళ్లడం వల్ల దంతాలు బలంగా అవుతాయి అని తెలుస్తోంది.


ఇక ముద్దులు పెట్టుకోవడం వల్ల శారీరకం గానే కాకుండా మానసికంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముద్దులు పెట్టుకునే ప్రాసెస్ లో మనిషి శరీరంలో ఆనందాన్ని కలిగించే  ఎండార్ఫిన్ ఉత్పత్తి అవుతాయట. దీనివల్ల మనిషి ఎంతో ఆనందంగా ఉంటాడు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల జంట మధ్య ప్రేమ పెరగడం మాత్రమే కాకుండా శారీరకంగా , మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: