అంతేకాదు దేవర పార్ట్ 1 చూసిన మొదటి ఆట జనాలు ఎందుకు సినిమాపై అంత నెగిటివిటీ వచ్చేలా చేశారో కని పెట్టిన కొరటాల శివ సెకండ్ పార్ట్ లో అలా కాకుండా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అసలు కథ పార్ట్ 2 లోనే ఉంది అని చెప్పడం ఈజీనే కానీ ఆ కథను కథనాన్ని ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చేయడంలోనే అసలు కథ ఉంటుంది. పార్ట్ 1 కథ సుఖాంతం అయినట్టే.. ఇక పార్ట్ 2 రగడ మొదలవుతుంది.
దేవర రెండో భాగం గురించి అటు కొరటాల శివ మీద ఇటు తారక రాముడి మీద సానా బాధ్యత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి భాగంతో అసంతృప్తి చెందిన కొద్దిమంది ప్రేక్షకులను సైతం పార్ట్ 2 కి విజిల్స్ వేసే బాధ్యత కొరటాల శివ మీద ఉంది. మరి అలా అయ్యేట్టు చేస్తాడా లేదా అన్నది చూడాలి. దేవర పార్ట్ 2 2026 సెకండ్ హాఫ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి దేవర పార్ట్ 2 ఎలా ఉంటుంది కొరటాల శివ మలి భాగం ఎలా తీస్తాడన్నది చూడాలి.