స్టార్ సినిమాల రిలీజ్ డేట్ ల పై కొనసాగుతున్న కన్ ఫ్యూజన్ ఫ్యాన్స్ అసంతృప్తికి కారణమవుతుంది. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ముందు ఖర్చీఫ్ వేస్తారు. ఐతే డేట్ దగ్గరకు వచ్చేదాకా సైలెంట్ గా ఉంటారు. పెద్ద సినిమా కదా అని చిన్న సినిమాలేవి ఆ డేట్ కి వచ్చే సాహసం చేయరు. తీరా చూస్తే ఆ సినిమాను వాయిదా వేస్తుంటారు. ఎక్కువగా ఈ వాయిదా పనులన్నీ భారీ బడ్జెట్ సినిమాలు.. స్టార్ హీరోల సినిమాలకే అవుతుంది.

ఐతే సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలకు మాత్రం రెండు కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు ముఖ్యంగా తెలుగు సినిమాకు సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ. ఆ టైం కి ఎన్ని సినిమాలు వచ్చినా బాగా ఆడతాయి. 2025 సంక్రాంతికి కూడా స్టార్ సినిమాల మధ్య ఫైట్ జరగనుంది. చిరంజీవి విశ్వంభర, వెంకటేష్ 76 వ సినిమా, బాలకృష్ణ 109 వ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఐతే ఈ రేసు లో నుంచి చిరు వెనక్కి తగ్గుతున్నాడని టాక్. చరణ్ గేమ్ చేంజర్ కోసం చిరు తన రిలీజ్ డేట్ వదిలేస్తున్నాడని అంటున్నారు. ఐతే చరణ్ కోసం చిరంజీవి సాక్రిఫైజ్ చేస్తుంటే.. అన్న కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ త్యాగానికి సిద్ధమయ్యాడట. పవన్ హరి హర వీరమల్లు సినిమా మార్చి 28కి రిలీజ్ అనుకున్నారు. ఆ డేట్ న విశ్వంభర రిలీజ్ షెడ్యూల్ చేస్తున్నారట. అదే నిజమైతే కొడుకు కోసం తండ్రి.. అన్న కోసం తమ్ముడు త్యాగం చేసినట్టు అవుతుంది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ మాత్రం 3 సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాల రిలీజ్ లలో ఏది ముందుకు ఏది వెనక్కి అవుతుంది అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: