ఒక్క హిట్టు కొట్టి వరుసగా ఫ్లాపులు అందుకుంటున్న హీరోల జాబితాలో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అయ్యాడు. వినరో భాగ్యము విష్ణు కథ సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా పడుకున్నాయి. రేసులో వెనకపడుతున్నా అని గుర్తించిన కిరభ్ అబ్బవరం నెక్స్ట్ సినిమాకు భారీ ప్లానింగ్ తో వస్తున్నాడు. క అనే టైటిల్ తో క్రేజీ సినిమా చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాను శ్రె చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యాన లో సుజిత్, సందీప్ దర్శక ద్వయం డైరెక్ట్ చేశారు.

సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఓవరాల్ రైట్స్ ను వంశీ నందిపాటి కొనుగోలు చేశారు. అంతేకాదు సినిమా థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ తోనే లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా సినిమా నుంచి వచ్చిన మాస్ జాత సాంగ్ ఇంప్రెస్ చేసింది. ఐతే క సినిమాను అసలైతే దసరా కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఉందని సినిమా వాయిదా వేసుకున్నారు.

ఇక క సినిమాను దసరాకి పోస్ట్ పోన్ చేసినా దీపవళికి రిలీజ్ లాక్ చేస్తున్నారని టాక్. దీవాళికి ఆల్రెడీ చాలా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేశాయి. అందులో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తో పాటు శివకార్తికేయన్ అమరన్ సినిమాలు వస్తున్నాయి. ఓ పక్క నవంబర్ 14న సూర్య కంగువ, వరుణ్ తేజ్ మట్కా వస్తున్నాయి. ఈ సినిమాల మధ్యలో క రిలీజ్ స్లాట్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ తో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం సినిమాను ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడన్నది చూడాలి. క విషయంలో కిరణ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నట్టు ఉన్నాడు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: