అయితే వేట్టయన్ మూవీలో జగన్ ను టార్గెట్ చేశారా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వేట్టయన్ సినిమా సెకండాఫ్ లో అదే తరహా సన్నివేశాలు ఉండటంతో గతంలో ఏపీ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారా అనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ఘటనలను ఆధారంగా చేసుకుని వేట్టయన్ తెరకెక్కించారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కామెంట్ల గురించి వేట్టయన్ టీమ్ స్పందిస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో వేట్టయన్ సినిమాలోని సన్నివేశాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉండదు.
దసరా సెలవులను వేట్టయన్ మూవీ పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందని ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం పక్కా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు వేట్టయన్ బుకింగ్స్ పరవాలేదనే విధంగా ఉన్నాయి. 10 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగగా ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. వేట్టయన్ మూవీ సక్సెస్ సాధించడం రజనీకాంత్ కెరీర్ కు కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా రిజల్ట్ ఆధారంగానే రజనీకాంత్ భవిష్యత్తు సినిమాల ఫలితాలు డిసైడ్ కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.