ఓటిటీ ప్రియులు ఎప్పుడూ కూడా ప్రతివారం వచ్చే కొత్త సినిమాలు కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు.. ముఖ్యంగా సక్సెస్ చిత్రాలు ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలవుతూ  ఉంటాయి. మరి ఈసారి దసరా పండుగకు ఒకవైపు థియేటర్లలో సూపర్ హిట్ చిత్రాలు మరొకవైపు ఓటీటీ లో బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా స్త్రిమ్మింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేస్తున్నాయి. అయితే ఈ శుక్రవారం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలోకి వస్తున్నాయి. మత్తు వదలరా-2 సినిమా థియేటర్లో మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమాలో స్ట్రిమ్మింగ్ అవుతుందో చూద్దాం.



ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న మత్తు వదలరా-2 సినిమా గత నెల 13వ తేదీన థియేటర్లో విడుదలయ్యింది. థియేటర్లో విడుదలైన నెల రోజులు కాకుండా ఈరోజు నెట్ ఫ్లిక్ లో స్ట్రిమ్మింగ్ కాబోతోంది. అలాగే తమిళంలో సూపర్ హిట్ అయిన వాల్తై సినిమా కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ట్రిమ్మింగ్ కాబోతోంది. థియేటర్లో ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ అందుకుందట. అలాగే బాలీవుడ్ లో ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న స్త్రీ-2 సినిమా కూడా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ అవుతోంది.

వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం శబరి ఈ సినిమా కూడా ఇప్పుడు సన్ నెక్స్ట్ లో ట్రిమ్మింగ్ అవుతున్నది.


జై మహేంద్ర మలయాళ వెబ్ సిరీస్ కూడా ప్రస్తుతం సోనీ లీవ్ లో స్ట్రిమ్మింగ్ కాబోతున్నది. ఇవే కాకుండా పలు రకాల వెబ్ సిరీస్లో సినిమాలు కూడా థియేటర్లో మెప్పించి ఓటీటి లో ట్రిమ్మింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ దసరాకి ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు ఓటిటీ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: