గేమ్ ఛేంజర్, సంక్రాంతికి కలుద్దాం సినిమాలకు దిల్ రాజు నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు మూడు రోజుల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. విశ్వంభర మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టేనని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలు అవసరం లేదని తెలుస్తోంది. బాలయ్య బాబీ కాంబో మూవీ జనవరి 9 లేదా 11 తేదీలలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
జనవరి 9 గురువారం కాగా జనవరి 11 శనివారం కావడంతో ఈ రెండు తేదీలలో ఒక తేదీని సితార నిర్మాతలు ఎంచుకోనున్నారు. ఈ సినిమాకు సైతం దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఈ విధంగా సంక్రాంతి సినిమాలకు నైజాం ఏరియాలలో వచ్చే కలెక్షన్లు అన్నీ దిల్ రాజుకే సొంతం కానున్నాయి. సినిమాల టాక్ ఆధారంగా దిల్ రాజు థియేటర్లలో మార్పులు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది.
గతేడాది మైత్రీ బ్యానర్ నుంచి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయి. 2023 సంక్రాంతి మైత్రీ బ్యానర్ కు కీలకం కాగా 2025 సంక్రాంతి మాత్రం దిల్ రాజుకు కీలకం కానుంది. గేమ్ ఛేంజర్ సంక్రాంతికి కలుద్దాం సినిమాల బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. దిల్ రాజు భవిష్యత్తు సినిమాలతో మరిన్ని హిట్లు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.