రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడు  చూద్దామా అని ఎంతో మంది ప్రభాస్ అభిమానులు చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా విజయవాడ కనక దుర్గ ఆలయానికి వచ్చిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి నా కొడుకు పెళ్లి త్వరలోనే ఉంటుందని, ఆ గుడ్ న్యూస్ మీ అందరికీ చెబుతానని, అలాగే నా ముగ్గురు కూతుర్లకు అల్లుళ్ళతోపాటు నా కొడుకు కోడలు కూడా వస్తుంది అంటూ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది శ్యామలా దేవి. అయితే అందరూ ఎదురు చూస్తున్నట్టే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరగబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు సోషల్ మీడియా లో ప్రభాస్ కి సంబంధించిన ఒక ఎంగేజ్మెంట్ డేట్ కూడా వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ప్రభాస్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు అనేది చూస్తే.. 

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నది అనుష్కని అని అందరూ అనుకుంటారు. కానీ టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి తన బంధువుల అమ్మాయిని ప్రభాస్ కి భార్యగా ఫిక్స్ చేసి పెట్టిందట. మొగల్తూరు లోని బంధువులు అమ్మాయినే ప్రభాస్ పెళ్లాడబోతున్నట్టు తెలుస్తుంది.ఇక వీరిద్దరి ఎంగేజ్మెంట్ అక్టోబర్ 23న ఉండబోతుందని సమాచారం. మరి చూడాలి అక్టోబర్ 23న ప్రభాస్ ఎంగేజ్మెంట్ చేసుకుంటారా..

లేక ఇది కూడా రూమర్ గానే మిగిలిపోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక ప్రభాస్ తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ అభిమానులతో దసరా పండుగ సందర్భంగా షేర్ చేసుకుంటారని తెలుస్తోంది. మరి ఎంతోమంది వేయికళ్లతో ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి కి సంబంధించిన రూమర్ నిజమవుతుందా.. లేక రూమర్ గానే మిగిలిపోతుందా అనేది చూడాలి. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే..చేతిలో నాలుగైదు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: