అయితే దేవర1 లో దేవర పాత్రను చంపేయడం కొరటాల శివ చేసిన పెద్ద తప్పు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర మూవీలో దేవర ఉన్న ప్రతి సీన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తే వర ఉన్న సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. దేవర సీక్వెల్ మొత్తం వర పాత్ర ప్రధానంగా సాగితే ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి అయితే కలిగించవని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దేవర ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన సన్నివేశాలు దేవర2 లో ఉన్నా ఫ్యాక్స్ కోరుకునే కిక్ మాత్రం దేవర పాత్రతోనే దొరుకుతుంది. కేవలం వర పాత్రను చూపిస్తే ఎలా కొరటాల అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు . ఆ పాత్ర చుట్టూ ఎంత అద్భుతమైన సీన్లు క్రియేట్ చేసినా ఫ్యాన్స్ కు ఎక్కుతాయా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వరను భయస్థుడిగా చూపించడమే సినిమాకు అతిపెద్ద మైనస్ అని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. దేవర విషయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్ల నుంచి కొరటాల శివ ఏం నేర్చుకుంటారో చూడాల్సి ఉంది. 2026లో రిలీజ్ టార్గెట్ గా కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర2 సినిమాకు సంబంధించి టెక్నీషియన్లు, నిర్మాతలకు సంబంధించి కొన్ని మార్పులు జరిగే ఛాన్స్ అయితే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పాలి.