నారావారి అబ్బాయి నారా రోహిత్ హీరో అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. "బాణం" సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్. అనంతరం సోలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసూర, శంకర, శమంతకమణి, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఇక ఈ సంవత్సరం "ప్రతినిధి 2" సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉండగా.... నారా రోహిత్ వ్యక్తిగత విషయానికి వస్తే.... నారావారి అబ్బాయి నారా రోహిత్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టరున్నారు. నారా రోహిత్ తన బ్యాచిలర్ లైఫ్ కి వీడ్కోలు పలికి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.... ఈనెల 13వ తేదీన నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.



చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్వయంగా రోహిత్ కు సంబంధం కుదిర్చినట్టు అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లో ఎంగేజ్మెంట్ జరగనుంది. చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్, బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులంతా వీరి ఎంగేజ్మెంట్ కు హాజరుకానున్నారు. ఇక వధువు ఎవరనే విషయం మాత్రం రహస్యంగా ఉంచారు.


కానీ "ప్రతినిధి 2" సినిమాలో రోహిత్ సరసన నటించిన హీరోయిన్ ని నారా రోహిత్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి పేరు సిరి లేళ్ల అని సమాచారం. ఇప్పటివరకు నారవారి కుటుంబం నుంచి కానీ, నందమూరి వారి కుటుంబం నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం నారా రోహిత్ కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: