కానీ గత కొంతకాలం నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని దూరం పెడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇలా కాస్త ఎదిగితే చాలు ఇక లైఫ్ ఇచ్చిన మామయ్య నే పక్కన పెట్టేసాడు అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. దీంతో మెగా అల్లు ఫ్యామిలీ ల మధ్య గొడవలు మొదలయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కేవలం అభిమానుల మధ్య కాదు ఏకంగా హీరోల మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ గత కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు.
కానీ మొదటిసారి అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందించాడట. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ కార్యక్రమానికి బన్నీ గెస్ట్ గా వచ్చాడట. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులపై బాలయ్య ఓపెన్ గా అడిగేసాడట. పవన్ తరపున కాకుండా వైసిపి తరఫున ప్రచారం చేయడం లాంటి విషయాలను కూడా అడిగారట. అంతేకాదు మెగా ఫ్యామిలీతో ఉన్న గొడవపై కూడా ప్రశ్నలు వేశారట. అయితే చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం గురించి వివరించడంతోపాటు.. ఇక వైసిపి తరఫున ప్రచారానికి నంద్యాల వెళ్లడానికి గల కారణాలను కూడా వివరించారట బన్నీ. దానికి తోడు ఇక మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాలపై కూడా నోరు విప్పారట. ఇలా ఇవన్నీ విషయాలపై క్లారిటీ ఇచ్చేసారట. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.