ఏకంగా తన డాన్సులతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసి ప్రేక్షకులు అందరిని కూడా మంత్రముగ్దులను చేసేసాడు. అయితే ఇలా నటుడిగా డాన్సర్ గా మాత్రమే కాదు రియల్ లైఫ్ లోను గొప్ప వ్యక్తిత్వం సేవ గుణంతో ఇక అభిమానులను కాలర్ ఎగరేసుకునేల చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ ఎంత అంటే.. వేల కోట్లు ఉండే అవకాశం ఉందని అంటూ ఉంటారు. అయితే ఇలా కోట్ల ఆస్తులు ఉండి లగ్జరీ లైఫ్ని గడిపే చిరంజీవికి నేలపై పడుకునే అలవాటు ఉందట. లగ్జరీ లైఫ్ ను వదిలేసి నేలపై పడుకోవాల్సిన అవసరం చిరంజీవికి ఏమిటి అని అనుకుంటున్నారు కదా.
ఇలాంటి అలవాటు వెనక కారణమేమిటి అన్న విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఆయన ఏ సినిమా ఈవెంట్ కు వెళ్ళిన చిరంజీవిని సినీ ప్రముఖులందరూ కూడా తెగ పొగిడేస్తూ ఉంటారు. ఆయనను మించిన హీరో మరొకరు లేరు అన్నట్లుగా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. అభిమానుల ప్రేమ ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇక ఇలాంటివి చూసినప్పుడు హీరోలకి మాకంటే గొప్ప వాళ్ళు లేరు అనే భావన కలుగుతుందని.. నిజంగా హీరోల ఫీలవుతామని.. కాసేపు మమ్మల్ని మేము మర్చిపోతాం అంటూ చెప్పుకోచ్చాడు చిరంజీవి. అయితే అభిమానం ప్రేమను ఎప్పుడూ తలకెక్కించుకొని ప్రవర్తించను. అందుకే సినిమా ఈవెంట్లు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి నేలపై పడుకుంటాను. నేలపైననే నిద్రపోతాను. నన్ను ఇంతలా ఆదరిస్తున్నారంటే.. ఆ గొప్పతనం నాది కాదు ఆడియన్స్ ది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.