నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఇప్పటికీ కృష్ణుడు రాముడు అంటే ఎవరు అంటే ఎన్టీ రామారావు పేరే ముందుగా గుర్తుకు వస్తూ ఉంటుంది. అలా పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు తారకరామారావు. ఇక ఏ పాత్ర పోషించిన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ.. ఇక ఎన్టీఆర్ చూపించిన నటన వైవిద్యం ఇక ప్రేక్షకులందరినీ కూడా ఫిదా చేసేస్తూ ఉండేది.


 కృష్ణుడిగా రాముడిగా తెలుగు ప్రేక్షకులకు అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయారు ఆయన. ఇక వెంకటేశ్వర స్వామిగా శివుడిగా రావణుడిగా భీష్ముడిగా ఇలా పౌరాణిక పాత్రలో ఆయన చేయని పాత్ర అంటూ లేదు అని చెప్పాలి. అలాంటి నందమూరి తారక రామారావు ఒక పౌరాణిక పాత్రను మాత్రం అస్సలు చేయలేదట. ఏకంగా దాసరి బతిమిలాడిన కూడా చేసేందుకు ఒప్పుకోలేదట. దాసరి - ఎన్టీఆర్ కాంబోలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు అనే చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 అయితే పౌరాణికాలకు పెట్టింది పేరుగా ఉండే ఎన్టీఆర్ తో తన దర్శకత్వంలో ఒక పౌరాణిక సినిమా చేయాలని దాసరికి కోరిక ఉండేదట. ఎన్టీఆర్ కోసం దాసరి ఒక కథను సిద్ధం చేసుకున్న ఫలితం లేకుండా పోయిందట. ఎన్టీఆర్ తో జరాసంధుడి పాత్ర ఆధారంగా ఒక సినిమా చేయాలని దాసరి అనుకున్నారు. అయితే కథ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్కు వినిపించారు. ఎన్టీఆర్కు కూడా కథ నచ్చింది. కానీ అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారూ. దీంతో పౌరాణిక చిత్రాల్లో నటించాలని ప్రకటించారు. దీంతో ఇక ఇచ్చిన మాటకు కట్టుబడి దాసరి ఎంత రిక్వెస్ట్ చేసిన ఆ సినిమాకు ఒప్పుకోలేదట. దీంతో జరాసంధుడి పాత్రను ఎన్టీఆర్తో నటింప చేయాలని కలలుగన్న దాసరికి ఆ కలగానే మిగిలిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

nt4