అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం నిహారిక ఒక్కటే. ఆమె కూడా హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. ప్రజెంట్ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంది . నిజానికి నిహారిక కంటే ముందే చిరంజీవి చిన్న కూతురు శ్రీజని ఇండస్ట్రీలో హీరోయిన్గా దింపాలి అని సురేఖ ఆశపడిందట . అదేవిధంగా అల్లు అరవింద్ కూడా ఆమెకు హెల్ప్ చేశాడట . అల్లు అర్జున్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన గంగోత్రి సినిమాలో హీరోయిన్గా మొదటగా శ్రీజని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నారట .
సురేఖ - అల్లు అరవింద్ సైతం అందుకు ఓకే చెప్పారట . కానీ చిరంజీవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కూతుర్లు హీరోయిన్లు కాకూడదు అని ముందుగానే నిర్ణయించుకొని ఉండడంతో శ్రీజ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రాకూడదు అంటూ బలంగా సురేఖ నిర్ణయాన్ని వ్యతిరేకించారట. అల్లు అరవింద్ , సురేఖ గంగోత్రి సినిమాలో శ్రీజ హీరోయిన్గా నటించడానికి చాలా చాలా ట్రై చేశారట. కానీ చిరు ఒప్పుకోలేదట . శ్రీజ కి హీరోయిన్ అవ్వాలి అని ఉన్న కూడా తండ్రి కోసం తన ఆశను వదిలేసుకుందట . అందుకే చిరంజీవికి శ్రీజ అంటే మొదటి నుంచి చాలా చాలా ఇష్టం . కానీ శ్రీజ కొన్ని లైఫ్ లో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ కి గురవుతూనే ఉంటుంది..!!