అదే సమయంలో మహేష్ బాబు రిజెక్ట్ చేసిన మూడు సినిమాలతో హిట్టు కొట్టాడు మరో హీరో. ఇలా మహేష్ వదిలేసిన సినిమాలు ఇంకో స్టార్ హీరో పాలిట ఏకంగా వరంలా మారిపోయాయి అని చెప్పాలి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుష్ప : పుష్ప సినిమాను ముందుగా మహేష్ బాబుతో చేయాలని సుకుమార్ అనుకున్నాడట. ఏకంగా మహేష్ లాంటి హ్యాండ్సమ్ హీరోతో పుష్పా లాంటి రా కంటెంట్ తీసి ప్రయోగంతో సక్సెస్ కొట్టాలని సుకుమార్ భావించాడట. కానీ మహేష్ బాబు మాత్రం ఒప్పుకోలేదట. తనకంటే అల్లు అర్జున్ కే ఈ పాత్ర సెట్ అవుతుందని సుకుమార్ చెప్పి మరి పంపించాడట. ఈ మూవీ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అలా వైకుంఠపురములో : త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురములో కథ ముందుగా మహేష్ దగ్గరికి వెళ్లిందట. కానీ అప్పుడు వేరే సినిమాలతో బిజీగా ఉండి డేట్స్ ఖాళీ లేవని చెప్పడం..తో ఇక ఈ కథ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లడం.. ఆయన చేసి హిట్టు కొట్టడం జరిగిపోయింది.
గోన గన్నారెడ్డి : గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రను ప్రేక్షకులు మరిచిపోలేరు. అయితే ముందుగా ఈ పాత్ర చేయమని గుణశేఖర్ మహేష్ బాబునే అడిగాడట. కానీ మహేష్ ఒప్పు కోకపోవడంతో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిందట. ఇలా మహేష్ వదిలేసిన మూడు సినిమాలు కూడా అల్లు అర్జున్ పాలిట వరంలా.. మారిపోయాయ్. నటుడుగా మరో మెట్టు ఎక్కించాయి అని చెప్పాలి.