- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ దర్శకు ధీరుడు ఎస్ఎస్ . రాజమౌళి సినిమా వస్తుంది అంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినిమా ప్రేమికులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మెగాఫోన్ పట్టి దర్శకుడుగా మారిన రాజమౌళి వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా టాలీవుడ్ లో కుర్ర స్టార్ హీరోలుగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో త్రిపుల్ ఆర్ లాంటి మల్టీస్టారర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రాజమౌళి టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కు తనయుడు కావటం విశేషం. రాజమౌళి సినిమాల్లోకి వచ్చాక బాగానే కూడా పెట్టుకున్నారు ఆయన స్థిర చరాస్తులు కలిపి రు. 500 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉంటాయని తెలుస్తోంది.
రాజమౌళి 2008లో పంజాగుట్లలో విల్లా కొన్నారు. ఇప్పుడు ఆయనకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. రేంజ్ రోవర్ బీఎండబ్ల్యూ లాంటి కార్లు కూడా ఉన్నాయి. ఆయన దగ్గర మొత్తం నాలుగైదు కార్లు ఉన్నాయి. వీటి వీలువ .. ఒక్కో కారు విలువ కోటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది. రాజమౌళి ఒక్కో సినిమాకు మామూలుగా రు. 25 కోట్ల రేంజ్‌లో రెమ్యునరే షన్ తీసుకునే వాడు. అయితే బాహుబలి 1 , బాహుబలి 2 సినిమాలు ... ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాలకు రెమ్యునరేషన్ కు బదులుగా ఒక్కో సినిమాకు రు. 70 కోట్ల నుంచి రు. 100 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ ?