ఇక ప్రస్తుతం మన చిత్ర పరిశ్రమ లో మంచి డిమాండ్ ఉన్న నటులలో మురళీ శర్మ కూడా ఒకరు .. ఈయనకి తెలుగు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి. మురళీ శర్మ తెనాలిలో పుట్టారు ముంబైలో పెరిగారు.. ఆయన తల్లి తెలుగు వారు కాగా తండ్రి మరాఠీ. అలాగే రోషన్ తనేజా ఇనిస్టిట్యూట్‌లో  ఆయన యాక్టింగ్ కోర్స్ కూడా నేర్చుకున్నారు .  ముందుగా బాలీవుడ్ లో నటించిన ఆయన ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా బాగా పాపులర్ అయ్యారు. ఇక విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన తెలుగులో ప్రస్తుతం సూపర్ జోష్లో దూసుకుపోతున్నాడు.  


ఇక భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,  అల వైకుంఠపురంలో ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన ఎన్నో విభిన్న పాత్రలో నటించి మెప్పించారు. ఇక మురళీ శర్మ కోసం దర్శకులు కూడా ఎన్నో వైవిద్య‌మైన క్యారెక్టర్లు కూడా రాస్తున్నారు. అయితే మురళీ శర్మ భార్య కూడా ఓ నటి అనే విషయం చాలా మందికి తెలియదు .. ఆయన భార్య పేరు అశ్విని కల్సేకర్ .. ఈమె కూడా బిజీ నటిగా కొనసాగుతుంది. ప్రస్తుతం హిందీలో ఎన్నో సీరియల్స్ సినిమాల్లో కూడా నటించారు. అలాగే సిఐడి సీరియల్ ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.


అలాగే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బద్రీనాథ్ సినిమాలో కీలక పాత్రలో కూడా ఈమె నటించారు. “నేనేవరో తెలుసా.. నీ మేనత్తను.. ఈ రాష్ట్రాన్ని పాలించే సర్కార్ భార్యను. ఒక్కసారి అత్త అని పిలవ్వే” అనే డైలాగ్ వింటే మాత్రం.. ఓ తనా అనుకుంటారు. ఈ మూవీలో తమన్నా మేనత్త పాత్రలో నటించారు అశ్విని కల్సేకర్. ఆ తర్వాత రవితేజ నటించిన నిప్పు మూవీలోనూ యాక్ట్ చేశారు. తెలుగులో ఆమె చివరిసారిగా మెహబూబ మూవీలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మరాఠిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: