ద‌స‌రా కానుకగా నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన  ర‌జ‌నీకాంత్ ‘వేట్ట‌య‌న్‌’ మూవీ.  ‘జైల‌ర్‌’ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఆయ‌న్నుంచి వ‌చ్చిన పూర్తిస్థాయి సినిమా కూడా ఇదే. ‘జై భీమ్’ లాంటి గొప్ప సినిమా తెర‌కెక్కిచిన‌ జ్ఞాన‌వేల్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డు...అలాగే ఈమూవీలో ర‌జ‌నీతో పాటు  అమితాబ్ బ‌చ్చ‌న్‌, రానా ద‌గ్గుబాటి వంటి అగ్ర న‌టులు  న‌టించ‌డంతో ‘వేట్ట‌య‌న్‌’పై భారీగా అంచ‌నాలు పెరిగాయి. మంచి ఓపినింగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది ఈ చిత్రం. తెలుగులో ఈ మూవీ తెలుగులో ఈ సినిమాకి  మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. రజనీకాంత్ క్యారెక్టర్ బాగున్న సినిమా స్టోరీ పరంగా బాలేదని విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్షన్ రాబెట్టిందో ఇక్కడ చూద్దాం.


రజనీకాంత్ సినిమాలకు ఓ సెపరేట్ ఫార్ములా ఉంటుంది. అదిరిపోయే హీరోయిజం ఉంటుంది. అయితే సామాజిక సందేశం ప్రధానాంశంగా తీసిన జై భీమ్ దర్శకుడు జ్వానవేల్ డైరక్షన్ అనగానే అభిమానులు అనుమాన పడ్డారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సినిమా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో రెడీ అయ్యిందని ట్రైలర్ తో అర్దమైపోంది. ఈ క్రమంలో రజనీకాంత్ అభిమానులంతా ఇప్పుడు 'వేట్టయన్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేసారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమా తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.


రజనీకాంత్‌ హీరోగా టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన మూవీ 'వేట్టయన్‌'. భారీ అంచనాల మధ్య తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం అభిమానులను అలరిస్తోంది. పాటలతో పాటు రజనీ యాక్షన్‌కు ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లలోనూ రికార్డును నెలకొల్పింది. కోలీవుడ్‌లో ఈ ఏడాది విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీల్లో రెండో స్థానంలో నిలిచింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.60కోట్లు పైగా (గ్రాస్‌) వసూలు రాబ‌ట్టిన‌ట్లు సమాచారం . ఇక గ‌తంలో విడుదలైన విజయ్‌ 'ది గోట్‌' కలెక్షన్లలో కోలీవుడ్‌లో తొలిస్థానంలో నిలవగా 'వేట్టయన్‌స‌  రెండులో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: