ఇక రోజా బాలీవుడ్ లో ఒకే ఒక హిందీ సినిమాలో నటించింది. రోజా మాతృభాష తెలుగు.. అయితే ఆమె తెలుగుతో పాటు తమిళ్ - కన్నడ - మలయాళం - హిందీ వంటి భాషలలో తనదైన ముద్ర వేసుకున్నారు. అలాంటి రోజా కెరియర్లో కేవలం ఒక్క బాలీవుడ్ సినిమాలో నటించింది. దివంగత మాజీ ఎంపీ .. మాజీ మంత్రి శివ ప్రసాద్ దర్శకత్వం లో తెరకెక్కిన ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు అడుగుపెట్టిన రోజా సర్పయాగం సినిమాతో ప్రత్యేకమైన ప్లేస్ టాలీవుడ్ లో సంపాదించుకుంది. ఆ తర్వాత భైరవద్వీపం సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా అయిపోయింది.
లేడీ అమితాబచ్చన్ విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమా లలో ఎక్కువ నటించారు. హీరోయిన్గా ఫెడవుట్ కావడంతో పొలిటికల్ వైపుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రోజా తమిళ డైరెక్టర్ ఆర్ కె. సెల్వమణిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. రోజా నటించిన హిందీ సినిమా ఏదో కాదు... మహేష్ భట్ డైరెక్షన్లో వచ్చిన ది జెంటిల్మెన్ అనే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో ఆమె నటించింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.