తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా మంచి పాపులారిటి సంపాదించుకున్న వారిలో దగ్గుబాటి వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో వెంకటేష్ జన్మించినప్పటికీ తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటేష్ సినిమా వస్తుందంటే ప్రతి ఒక్కరికి మినిమం గ్యారెంటీ ఉంటుంది. విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. సీనియర్ నిర్మాత డి. రామానాయుడు తనయుడైన వెంకటేష్ హీరో కాకముందు నుంచే కోటీశ్వరుడు. మొదట సినిమాల్లోకి రావాలని వెంకటేష్ అనుకోలేదట.


ఎప్పుడు బిజినెస్ చేయాలని ఆలోచనలతో ఉండేవాడట. అయితే అప్పటికే అన్నయ్య సురేష్ బాబు నిర్మాతగా రాణిస్తుండడంతో ఎవరో ఒకరు హీరోగా రావాలని వారి తండ్రి కోరడంతో మొదట్లో ఇష్టం లేకుండానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఒకానొక సమయంలో వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో యాంకర్ అతడిని నేరుగా ఓ ప్రశ్న అడిగింది. మీరు ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు. మీ నాన్న నిర్మాత కాబట్టి హీరోగా సులభంగా అవకాశాలు వస్తాయి అనుకొని వచ్చారా అని ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు వెంకటేష్ చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. నాకు సినిమాల్లో నటించాలని కోరిక ముందు నుంచి లేదు. డిగ్రీ చేయాలి, చదువుకోవాలి అనుకునేవాడిని. నా చదువు పూర్తయ్యే వరకు ఎలాంటి వృత్తిని ఎంచుకోలేదు. బహుశా దేవుడు రాసిన రాత ఏమో అనుకోకుండా హీరో అయ్యాను అంటూ వెంకటేష్ తెలిపారు. మా నాన్న నిర్మాత కాబట్టి నేను సినిమాల్లోకి రాలేదు. అతనికి మా కుటుంబం నుంచి ఎవరో ఒకరు హీరోగా రావాలని కోరిక ఉండేది.


అందుకే అయిష్టంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. అదృష్టం కలిసి వచ్చి మంచి హీరోగా రాణిస్తున్నానని వెంకటేష్ తెలిపారు. ఈ విషయాన్ని వెంకటేష్ చంటి సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వెల్లడించాడు. ఇక వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తన సినిమా వచ్చిందంటే ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు సినిమా చూడకుండా ఉండలేడు.

మరింత సమాచారం తెలుసుకోండి: