టాలీవుడ్ అగ్ర దర్శకులలో రాజమౌళి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో అదే క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుకుమార్ కూడా ఒకరు.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక డిసెంబర్లో ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాపై సౌత్ కంటే నార్త్ లోనే భారీ క్రేజ్ ఉంది. పుష్ప పార్ట్ 1 బాలీవుడ్ లోని ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఇప్పుడు పుష్ప2పై అంచనాలు పెరిగిపోవటంతో మూవీ స్క్రిప్ట్ నటి నటులు అంతా రెడీగా ఉన్నా షూటింగ్ పూర్తవుతున్న రిలీజ్ డేట్ మారుతూ వచ్చింది. ముందుగా ఈ సినిమాని గత ఆగస్టులో రిలీజ్ చేయాలని భావించారు. కానీ తర్వాత డిసెంబర్ కు మార్చారు. ఇప్పుడు కూడా ఈ సినిమా విడుదల తేదీలో అనుమానాలు ఉన్నాయని కూడా అంటున్నారు.


ఇక సుకుమార్ పుష్ప 2 తర్వాత  రామ్ చరణ్ తో మూవీ చేస్తారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇదే క్రమంలో కరోనా సమయంలో ఈ లెక్కల మాస్టర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ మూవీ చేస్తానని మాట ఇచ్చాడట. అలాగే ఆ సినిమాకు  “రాంపేజ్”  అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశాడు. ఇక గతంలో విజయ్ దేవరకొండ  స్వయంగా సుకుమార్ తో మూవీ కన్ఫర్మ్ అయిందంటూ ఆయనతో దిగిన ఫోటోను మూవీ టైటిల్  “రాంపేజ్”  అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే ఈ కాంబినేషన్ పక్కాగా ఉంటుందని విజయ సన్నిహితులు అంటున్నారు. అయితే ఇండస్ట్రీలో అన్ని అనుకున్నట్లు జరిగే అవకాశాలు తక్కువ కాబట్టి అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అని అనుమానాలు కూడా వస్తున్నాయి అసలే సుకుమార్ మేకింగ్ కోసం ఏ రేంజ్ లో టైం తీసుకుంటాడో కొత్తగా చొప్పునక్కర్లేదు  రాజమౌళి కంటే భిన్నమైన పని రాక్షసుడులా సుకుమార్ మారిపోతాడు ఎందుకంటే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నా కూడా పుష్ప2 అనుకున్న సమయానికి రాలేదు.


అలాగే పుష్ప తర్వాత రామ్ చరణ్ సినిమాను కన్ఫర్మ్ చేశాడు. ఇక ఈ సినిమాకు మూడేళ్లకు పైగా టైం పట్టిన షాక్ కావాల్సిన పనిలేదు. అసలే రంగస్థలం కాంబో కాబట్టి అంచనాలు మామూలుగా ఉండవు. ఇక దీంతో సుకుమార్ మునుపటి కంటే ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పుష్ప3 కూడా ఉండొచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక దీంతో విజయ్ దేవరకొండ  “రాంపేజ్”  అసలు ఎప్పుడు ఉంటుందనేది ఒక మిస్టరీగా తయారైంది. ప్రస్తుతం ఈ రౌడీ హీరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈలోపు సుకుమార్ రామ్ చ‌రణ్ సినిమాను కంప్లీట్ చేసి దేవరకొండ “రాంపేజ్”  పై ఫోకస్ చేస్తే బాగుంటుందని కూడా అంటున్నారు. ఇదే క్రమంలో పుష్ప2 1000 కోట్లు, రామ్ చరణ్ సినిమా కూడా ఇదే స్థాయిలో హిట్ అయితే విజయ్ సుకుమార్ సినిమాపై డౌట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అసలే విజయ్‌కు పాన్ ఇండియా గండం ఉంది. గతంలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు సుకుమార్ తో కూడా అలాంటి ప్రయోగమే చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కాంబోలో ఆస‌లు సినిమా వస్తుందో లేదో కూడా దేవుడికి తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: