ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం అవకాశాలు లేక పారితోషికం కూడా తక్కువ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇక పూజ హెగ్డే రెమ్యూనరేషన్ తగ్గించుకుంది అంటేనే ఆమె క్రేజ్ ఇండస్ట్రీలో ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ దళపతి 69వ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే సూర్య మూవీలో కూడా హీరోయిన్ రోల్ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ దళపతి మూవీ కోసం పూజ హెగ్డే తన రెమ్యూనరేషన్ తగ్గించుకొని సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. పూజ హెగ్డే కి సినిమాల్లో అంతగా అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని చూస్తుందట. 

ఇక ఇప్పటికే పూజా హెగ్డే కి చాలామంది హీరోలతో ఎఫైర్ వార్తలు వినిపించినప్పటికీ ఆ సీరియల్ నటుడితో మాత్రం ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది. స్టార్ హీరోయిన్ గా సౌత్ నార్త్ లో రాణించిన పూజ హెగ్డే ఓ సీరియల్ నటుడితో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక విషయంలోకి వెళ్తే..  బాలీవుడ్ సీరియల్ నటుడు రోహన్ మెహ్రాతో గత కొద్ది రోజుల నుండి పూజ హెగ్డే డేటింగ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ కలిసి అప్పుడప్పుడు ముంబైలో మీడియా కంట పడతారు. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ఎక్కువగా కలిసి తిరగడంతో పూజ హెగ్డే తన లవ్ మ్యాటర్ ని బయట పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వీరిద్దరు కలిసి కారులో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దీంతో పూజ హెగ్డే పెళ్లి వార్తలు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.ఇక పూజ హెగ్డే త్వరలోనే సీరియల్ నటుడితో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. మరి నిజంగానే పూజ హెగ్డే సినిమాలకు బ్రేక్ ఇచ్చి రోహన్ మెహ్రా ని పెళ్లి చేసుకుంటుందా లేక పెళ్లయినా కూడా సినిమాలకు పులిస్టాప్ పెట్టకుండా అందరు హీరోయిన్ల లాగే రాణిస్తుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: