టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక కెరీర్ అనుకున్న రేంజ్‌లో ముందుకు వెళ్ల‌డం లేదు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా త‌ర్వాత వ‌రుస ప్లాపులు.. ఆ త‌ర్వాత వాల్తేరు వీర‌య్య ఓకే సినిమా .. ఆ సినిమా హిట్ అయ్యింది.. ఆ వెంట‌నే భోళా శంక‌ర్ పెద్ద డిజాస్ట‌ర్‌. ఇక ఇప్పుడు మ‌ల్లిడి వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వంభ‌ర సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సోషియో ఫాంట‌సీ క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.


ఇదిలా ఉంటే గ‌తంలో అంటే 1996 ఆ టైంలో వరుస ఫ్లాపుల తర్వాత హిట్లర్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని కంబ్యాక్ అయిన మెగాస్టార్ మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే చిరుతో సినిమాలు చేసేందుకు నిర్మాత‌లు ఆయ‌న ఇంటి ముందు అప్ప‌ట్లో క్యూ క‌ట్టేవారు. హిట్లర్ - మాస్టర్ - చూడాలని ఉంది - బావగారూ బాగున్నారా - ఇద్దరు మిత్రులు - అన్నయ్య - డాడీ ఇలా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.


ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ లో సీనియ‌ర్ హీరో సంజయ్ దత్ నటించగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన శంకర్ దాదా ఎం ఎం బి బి ఎస్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమా చూసిన చిరు రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా ఆ సినిమా ఇక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స్టాలిన్ సినిమా భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి డిజాస్టర్ అయింది.


ఆ త‌ర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వ‌చ్చిన సీక్వెల్ మూవీని కూడా చిరు రీమేక్ చేశారు. మొదటి భాగానికి జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు. అయితే సీక్వెల్ సినిమాకు మాత్రం ప్రభుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇది తెలుగులో పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే తొలి భాగానికి హీరోయిన్ సోనాలి బింద్రే చాలా ప్ల‌స్ అయ్యింది. సీక్వెల్ లో మాత్రం కరిష్మా కొటక్ అనే అమ్మాయి నటించింనా.... ఎంత చిరంజీవి ఏజ్ కి తగ్గట్టు తీసుకున్న మరీ సగం వయసైపోయిన ముదురులా కనిపించింది. అస‌లు హీరోయిన్‌ను చూసే చాలా మంది చిరు అభిమానులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌లేదంటే ఈ సినిమాకు హీరోయిన్ ఎంత మైన‌స్ అయ్యిందో తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: