సినిమా పరిశ్రమ లో కొంత మంది కి మంచి విజయాలు దక్కితే అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి . మరి కొంత మంది కి మాత్రం విజయాలు లేకపోయి న తమ అందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ రావడంతో వరుసగా సినిమా అవకాశాలు తక్కుతాయి . అలా తెలుగు సినీ పరిశ్రమలో విజయాలు లేకపోయిన వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న బ్యూటీ లలో కావ్య దాపర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు.

కానీ ఈమె నటించిన ప్రతి సినిమాలో కూడా తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ రావడంతో ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం కావ్య నటించిన నాలుగు సినిమాలు ఇప్పటి వరకు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం మొదటగా ఈ బ్యూటీ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత ఈగల్ అనే మూవీ తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. కొంత కాలం క్రితం కావ్య "డబల్ ఇస్మార్ట్" అని మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇకపోతే ఈ రోజు ఈ ముద్దు గుమ్మ నటించిన విశ్వం మూవీ థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమాతో ఈ ముద్దు గుమ్మకు ఏ రేంజ్ విజయం దక్కుతుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: