ఇదే క్రమంలో నిన్న రజనీకాంత్ వేట్టయన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. అలాగే జైలర్ స్థాయి మ్యాజిక్ రిపీట్ అవదని అర్థం అయిపోయింది . అలాగే మరో సినిమా మా నాన్న సూపర్ హీరో గురించి చెప్పాలంటే ఇది ఎమోషనల్ డ్రామా.. ఫ్యామిలీ ఆడియన్స్ వరకు మెప్పిస్తుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ విశ్వం డీసెంట్ రివ్యూ తెచ్చుకుంటుంది. శ్రీను వైట్ల కం బ్యాక్ అవుతాడా లేదా అనేది వేచి చూడాలి. అలాగే ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకున్న వారికి జనగా అయితే గనక ఫలితం రేపు తేలనున్న ఉంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ సినిమా మార్టిన్ ఈ సినిమాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో సరిగా షోలు పడలేదు. ఇంత భారీ సినిమాలకే సరైన బజ్‌లేదు దానికి తోడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి.
అలాగే అలియా భట్ నటించిన జిగ్రాను అసలు ప్రేక్షకులు పట్టించుకోవటం లేదు. ఇవన్నీ గమనిస్తే దేవరకు ఇంకో వారాంతం దున్నేసే ఛాన్స్ దొరికినట్టే. ప్రస్తుతానికి టీమ్ ప్రమోషన్లు ఆపేసింది కానీ ఇప్పటికే పబ్లిక్ లోకి వెళ్ళిపోయిన టాక్ తో పాటు ఓటిటి స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతే ఉంటుందనే వార్త కలెక్షన్లకు దోహదపడుతోంది. మెయిన్ సెంటర్స్ లో శని ఆదివారాలు హౌస్ ఫుల్స్ పడటం ఖాయం. నైజాం, సీడెడ్ లో దేవర స్ట్రాంగ్ గా ఉంది. పండగ సందర్భంగా పదిహేనో రోజు అనంతపురం లాంటి చోట్ల ఉదయం ఎనిమిది గంటలకు స్పెషల్ షోలు వేస్తున్నారు.