సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వేట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిన్న అనగా అక్టోబర్ 10 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అందులో భాగంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిన్ననే భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ పై మొదటి నుండి తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు నెలకొని ఉండడంతో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ మూవీ కి సంబంధించిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 50 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక మొదటి రోజు బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.70 కోట్ల షేర్ ... 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 15.30 కోట్ల షేర్ కలక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: