ఇక ఎప్పటిలాగానే నామినేషన్స్ ఎలిమినేషన్స్ బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు అంటూ ఇక ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే టాస్కుల్లో తక్కువ ఎఫెర్ట్ పెడుతున్న కారణంగా విష్ణు ప్రియ ఈసారి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ విష్ణు ప్రియ ప్రస్తుతం సేవ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నామినేషన్స్ లో యష్మి గౌడ, విష్ణు ప్రియ,కిరాక్ సీత, పృధ్విరాజ్, గంగవ్వ, మెహబూబ్ లు ఉన్నారు. అయితే హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వకు అందరికంటే ఎక్కువ ఓటింగ్ దక్కుతుంది 26.2% ఓట్లు ఆమెకు పడగా.. మహబూబ్ 19.9% ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
ఇక ఆ తర్వాత మూడో స్థానం కోసం పోటీపడిన విష్ణు, యశ్మీలు ఇప్పుడు సేఫ్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. విష్ణు ప్రియ కు 19.03%, యష్మికి 15.42% ఓటింగ్ నమోదయింది. ఇక పృధ్విరాజ్ 14.5% ఓటింగ్ తో 5వ స్థానంలో ఉండగా కిరాక్ సీత 10.3% ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉంది. చివర్లో ఉన్న పృథ్వీరాజ్ కిరాక్ సితలలో ఎవరో ఒకరు ఈసారి ఎలిమినేట్ కావడం ఖాయం అనేది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పృథ్విరాజ్ గేమ్స్ లో తన ఎఫర్ట్ చూపిస్తున్నాడు. దీంతో ఇక ఈసారి కిరాక్ సీత హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రాబోతుంది అందరికి తెలుస్తుంది.