అయితే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా వెళ్లడం అంటే అది ఒక పెద్ద టాస్కే అని చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక లైఫ్ మొత్తంలో ఎన్ని ఎక్స్పీరియన్స్ లు అయితే చేయగలడో.. బిగ్ బాస్ హౌస్ లో అంతకుమించిన ఎక్స్పీరియన్స్ లు అవుతూ ఉంటాయి. ఎందుకంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తోనే గొడవపడడం.. గొడవపడిన నిమిషాల్లోనే ఇష్టం లేకపోయినా మాట్లాడటం.. వాళ్లతోనే కలిసి తినడం కలిసి పడుకోవడం.. ఇలా అన్నీ కూడా సర్దుకుపోయి చేయాల్సి ఉంటుంది. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పరిస్థితులను చూస్తే బయట ఉన్న ప్రేక్షకులకు సైతం కొన్ని కొన్ని సార్లు భయమేస్తూ ఉంటుంది అని చెప్పాలి.
అందుకే కొన్ని కొన్ని సార్లు హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా వెళ్లిన వారు కూడా బయటికి వెళ్లిపోతాము అంటూ కోరుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మళ్లీ బయటికి రావాలి అంటే అది నిర్వాహకులు నిర్ణయించాల్సిందే. ఎలిమినేట్ అవ్వడమో లేక నిర్వాహకులు కావాలని బయటికి పంపించడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల హిందీ బిగ్ బాస్ లో మాత్రం ఒక కంటెస్టెంట్ ఏకంగా బిగ్ బాస్ హౌస్ గోడదూకి పారిపోయిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏం జరిగిందో తెలియదు. కానీ హౌస్ లో లో ఏకంగా ఫెన్సింగ్ ని దాటుకుని బయటికి వెళ్లిపోయాడు కంటెస్టెంట్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.