కేవలం కన్నడలోనే కాకుండా తమిళ , తెలుగు , మలయాళ హిందీ భాషల్లో కలిపి 100 కు పైగా సినిమాల్లో నటించారు . సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సౌందర్య మనవరాలి పెళ్లి అనే సినిమాతో తెలుగు లో తన ప్రయాణం మొదలుపెట్టారు . అతి తక్కువ సమయంలో నే ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ను సంపాదించుకున్నారు . అలాంటి సౌందర్య అంతఃపురం సినిమాలో నటించే సమయంలో బిజీగా ఉండటం వలన ఒక యాక్షన్ సన్నివేశానికి రాలేకపోయారు.
ఇక ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూ యాంకర్ గా చేస్తున్నటు వంటి జోగినాయుడుగారు .. అంతపురం సినిమా సమయంలో దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే వాడు . అయితే అంతపురం సినిమా షూటింగ్ సమయం లో ఒక సన్నివేశం లో కూడా ఇతను కనిపిస్తారు . దీంతో కృష్ణవంశీ గారు సౌందర్య కు డూప్ గా జోగి నాయుడు ని పెట్టి ఓ యాక్షన్ సన్నివేశం తెర్కెక్కించారు , అలా సౌందర్య గారు వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయారు . అతి చిన్న వయసులో నే విమానం కూలి మరణించారు . ఇలా సౌందర్య కు డూప్ గా అబ్బాయి నటించాడనే విషయం చాలా మంది కి తెలియదు .