స్టార్ హీరోగా ఎదుగుతున్న మహేష్ బాబును బాలకృష్ణ అల్లుడు చేసుకోవాలని భావించారట. ఇదే విషయాన్ని మహేష్ తో కూడా చెప్పాడట. మహేష్ మా పెద్దమ్మయి బ్రాహ్మినేని నువ్వు పెళ్లి చేసుకుంటావా? అని కూడా అడిగాడట .. ఇక బాలయ్య పెట్టిన ప్రపోజల్‌ని మహేష్ సున్నితంగా తిరస్కరించాడట. ఇక మహేష్ నో చెప్పడంతో బాలకృష్ణ తన మేనల్లుడు నారా లోకేష్ కి ఇచ్చి బ్రాహ్మినేని పెళ్లి చేసాడు. ఇక బ్రాహ్మణి ఎంతో అందమైన అమ్మాయి.. అలాగే నటరత్న ఎన్టీఆర్ మనవరాలు.
అలాంటి అమ్మాయిని మహేష్ ఎందుకు నో చెప్పాడు అంటే.. అప్పటికే మహేష్ బాబు ప్రేమలో ఉన్నాడు .. 2002లోనే హీరోయిన్ నమ్రత తో మహేష్ రిలేషన్ లో ఉన్నాడు వంశీ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట 2005 లో పెళ్లి చేసుకున్నారు . అప్పటికే నమ్రతను ప్రేమిస్తున్న మహేష్ ఆమెని పెళ్లి చేసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. అందుకే బాలకృష్ణ పెద్ద కూతురికి నో చెప్పాడు. మహేష్ తో నమ్రత తో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంది. అలాగే వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలా నమ్రత కారణంగా మహేష్, నందమూరి కుటుంబానికి అల్లుడు కాలేకపోయాడు.