మహేష్ బాబు - వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుద‌లై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది . అలాగే ఈ సినిమాలో మహేష్ - వెంకటేష్ మధ్య అన్నదమ్ముల అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు. అలాగే ఈ సినిమాలో మహేష్ లవర్ బాయ్ గా ఎంతో క్యూట్ గా కనిపించారు. అలాగే తన వెంట ఎంతో మంది అమ్మాయిలు పడుతూ ఉండే అబ్బాయిగా నటించార.


అయితే ఈ సినిమాలో మహేష్ రైల్వే స్టేషన్లో ఉన్నటు వంటి సమయంలో తన వెంట ఒక అమ్మాయి వెంట పడుతూ మాట్లాడుతుంది. అయితే ఆ అమ్మాయి ఈ సినిమాలో కనిపించింది కొంతసేపే అయినప్పటికీ .. చాలా ఫేమస్ అయింది . ఇంతకీ ఆ అమ్మాయి పేరు సుప్రియ ఐసోలా.. ఆ అమ్మాయి అందరికీ గుర్తుండే ఉంటుంది.. టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ఎంతో సంప్రదాయంగా కనిపించే ఈ అమ్మాయి గతంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ మూవీ బాబు బాగా బిజీ లో బోల్ట్ క్యారెక్టర్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది.


అయితే ఈ సినిమా తర్వాత ఈమెకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. ఇక దాంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కొన్ని సినిమాల్లో నటిస్తూ అక్కడే బిజీగా ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో రానా - వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించింది. అలాగే ప్రస్తుతం బాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎంతో పద్ధతిగ కనిపించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: