మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత చరణ్ తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకుంది. తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు.

ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఎస్ జె సూర్య ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఒక వేళ ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసినట్లయితే ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లోనే భారీగా ఇతర సినిమాలతో పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా సినిమాలు ఆ సమయంలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. దాని ద్వారా ఈ మూవీ కి ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాల ద్వారా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. అలా జరిగితే గేమ్ చేంజర్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్లు కాస్త తగ్గే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: