సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి.  కొన్ని సినిమాల హిట్ అవుతాయి. . మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి.  అయితే ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మాత్రం అలా చరిత్రలో నిలిచిపోతాయి. . అలాంటి సినిమాలలో ఒకటే "ఠాగూర్". వివి వినాయక దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రేయ శరణ్ - జ్యోతిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ చరిత్ర తిరగరాసిందనే చెప్పాలి . అంతేకాదు మెగాస్టార్ రేంజ్ ని మరొక మెట్టు ఎక్కిచ్చిందనే చెప్పాలి .


సమాజంలో 'లంచం' అనేది ఏ రేంజ్ లో పాతుకుపోయిందో అనే విషయాన్ని చాలా కళ్ళకు కట్టినట్లు క్లియర్గా తెరకెక్కించాడు . . అప్పట్లో ఈ సినిమా ఎంత హైలెట్ అయిందో అందరి జనాలకు ఎంత బాగా ఎక్కేసిందో మనకు బాగా తెలిసిందే. అయితే ఇలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో రావడం లేదు.  కాగా ఈ మధ్యకాలంలో గతంలో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్ అంటూ పార్ట్-2 అంటూ డైరెక్టర్స్ మళ్లీ ఆ సినిమాలకి పునర్వైభవం తీసుకొస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.



ఠాగూర్ సినిమాకు సీక్వెల్ రావాలి అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . అంతేకాదు ఠాగూర్ సినిమా సీక్వెల్లో కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ నటించాలి అంటూ కోరుకుంటూన్నారు.  జూనియర్ ఎన్టీఆర్ అయితేనే ఠాగూర్ 2 కు న్యాయం చేస్తాడు అని , ప్రజెంట్ సమాజంలో ఆడపిల్లలపై ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి.. అదేవిధంగా నేటి సమాజంలో డబ్బు ఎంత కీలకంగా మారిపోయింది .. . ఎలాంటి తప్పుదావలకు అయినా మళ్ళించేలా మనీ చేస్తుంది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు  .. చూద్దాం మరి ఠాగూర్  సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: