అంతేకాదు స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా ఆ వార్త చదువుకొని తెగ నవ్వేసుకుంటున్నారు . సాధారణంగా ఎవరింట్లో అయినా సరే భార్య చెప్పిన మాట వినాలి అన్న రేంజ్ లో ఉంటుంది . అయితే స్టార్ హీరోలు ఇంట్లో కూడా అంతే అనే విధంగా భార్యలు నడుచుకుంటూ ఉంటారట . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ హీరోలు కూడా తమ భార్య చెప్తే ఆ విషయంలో మాత్రం అసలు నో చెప్పారట. ఎటువంటి విషయంలోనైనా సరే భర్తలు చెప్పిన విధానాన్ని ఓకే చెప్పే స్టార్ హీరోల భార్యలు.. ఆ ఒక్క విషయంలో మాత్రం కచ్చితంగా తాము చెప్పిందేలా బిహేవ్ చేస్తూ ఉంటారట. మరీ ముఖ్యంగా మహేష్ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన , ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట.
పిల్లల పెంపకం విషయంలో పిల్లలను గారాభం చేసే విషయంలో పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇంట్లో మదర్స్ దే ఫైనల్ డెసిషన్ అనే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారట . అఫ్ కోర్స్ ఆ విషయంలో స్టార్ హీరోలు కూడా భార్యలు చెప్పినట్లే నడుచుకుంటూ సైలెంట్ అయిపోతూ ఉంటారట . మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు అందరూ కూడా తమ పిల్లల్ని చాలా గారాబంగా పెంచాలని చూస్తారు . కానీ ఆ స్టార్ హీరోల భార్యలు మాత్రం పిల్లలకు ప్రతి రూపాయి విలువ తెలిసేలా పెంచాలి.. జాగ్రత్తలు చెప్పాలి అనే విధంగా పద్ధతులు నేర్పిస్తూ తగిన జాగ్రత్తలు చెప్తూ ఉంటారట. ఎంత డబ్బున్న ఎంత పలుకుబడి ఉన్నా తమ గుణాల ద్వారానే మంచి పేరు అనేది వస్తుంది అని వాళ్లకు బాగా తెలుసు .. అందుకే పిల్లల విషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు ఆ హీరోల భార్యలు అని వాళ్లని ఇష్టపడే ఫ్యాన్స్ చెపుతున్నారు..!!