టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తరువాత ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడంతో చాలా తక్కువ కాలంలోనే పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే ను హీరోయిన్గా అనుకొని ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చాక ఈమెను తీసేసి మరో ముద్దుగుమ్మను హీరోయిన్గా పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన కొత్తలో ఈ మూవీ లో పూజా హెగ్డే ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. ఈమెపై కొంత బాగం షూటింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం పూజా హెగ్డే నటించలేదు. ఈ మూవీ బృందం పూజ హెగ్డే స్థానంలో శ్రీ లీలను హీరోయిన్గా తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

కొంత కాలం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ అనౌన్స్ అయిన తర్వాత ఈ సినిమాలో పవన్ కి జోడిగా పూజా హెగ్డే నటించనుంది అని ఓ వార్త తెగ వైరల్ అయింది. ఇక చివరకు చూస్తే ఈ సినిమాలో కూడా శ్రీ లీల ను హీరోయిన్గాఎకరా ఎంపిక చేసుకున్నారు. ఇలా ఈ రెండు సినిమాలలో ఆల్మోస్ట్ పూజా హెగ్డే హీరోయిన్గా ఫైనల్ అయింది అని వార్తలు వచ్చిన తర్వాత శ్రీ లీలను హీరోయిన్గా మేకర్స్ ఎంపిక చేసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: