రామ్ గోపాల్ వ‌ర్మ‌ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ పోస్ట్స్ , పోస్టులు పెట్టి వైరల్ అవుతూ ఉంటాడు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక చీర కట్టుకున్న అమ్మాయి రీల్ వీడియో పోస్ట్ చేసి ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి అని పోస్ట్ చేశాడు ఆర్జీవీ. ఇంకేముంది రాత్రికి రాత్రి ఆ అమ్మాయి వైరల్ అయి ఆ అమ్మాయి డీటెయిల్స్ ఆర్జీవీకి వెళ్లిపోయాయి. కొన్ని రోజులు ఆ అమ్మాయి వీడియోలు పోస్ట్ చేసి తనని వైరల్ చేసి, ఆ అమ్మాయితో ‘శారీ'(చీర) అనే సినిమా తీస్తాను అని ప్రకటించాడు. ఆ అమ్మాయిని అందంగా వీడియోలు తీస్తున్న కెమెరామెన్ ని సైతం పిలిపించి మాట్లాడాడు.ఆమె మళయాళంకి చెందిన శ్రీలక్ష్మి అలియాస్ ఆరాధ్య దేవి అనే ఆర్టిస్ట్ అని తెలిసి, తన సోషల్ మీడియా అకౌంట్ తెలియడంతో తెలుగు యువత అంతా ఆమెని ఫాలో కొట్టడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి కూడా ఆర్జీవీ తనని పొగిడినందుకు సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఆర్జీవీ తనతో శారీ సినిమా ప్రకటించాడు కానీ నిజంగానే తీస్తారని అనుకోలేదు. ఓ పక్క వ్యూహం సినిమా రిలీజ్ బిజీలో ఉన్న ఆర్జీవీ తాజాగా అమ్మాయి హీరోయిన్ గా ‘శారీ’ టైటిల్ తోనే సినిమా ప్రకటించాడు.ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మొదట్లో చీరలో మాత్రమే కనిపించే ఆరాధ్య దేవి ఇప్పుడు గ్లామర్‌ ఫోటోలతో షేక్‌ చేస్తుంది. ఈ విషయంపై ఆమె తాజాగా ఇలా రియాక్ట్‌ అయింది.

మొదట్ల ఛాన్సులు వచ్చినప్పటికీ గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని సోషల్‌మీడియా ద్వారా ఆరాధ్యాదేవి చెప్పింది. గ్లామరస్‌తో పాటు ఎలాంటి పాత్రలకైనా తాను సిద్ధమేనని ప్రకటించింది. అలాంటి చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆరాధ్య తెలిపింది.'కాలం మారుతున్న కొద్దీ మన అభిప్రాయాలు మారుతాయంటూనే.. జీవిత అనుభవాలే మన నిర్ణయాలను మారుస్తాయని చెప్పుకొచ్చింది. గ్లామర్ అనేది చాలా వ్యక్తిగతమైనది. నాకు, అది వృత్తిలో భాగం. నటిగా వైవిధ్యంగా ఉండటం చాలా కీలకం. గ్లామరస్‌గా ఉన్నా, లేకపోయినా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధమే. ఉత్తమ పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. గ్లామర్ పాత్రలు చేయకూడదని గతంలో నిర్ణయించుకున్నాను. కానీ, 22 ఏళ్ల వయసులో నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకుంటున్నా.' అని ఆరాధ్య పేర్కొంది.మరి ఈ శారీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, లేక గతంలో అనౌన్స్ చేసి వదిలేసినా కొన్ని సినిమాల్లాగే నిలిచిపోతుందా చూడాలి. ఇక ఆర్జీవీ పరిచయం చేసిన అమ్మాయి కచ్చితంగా వైరల్ అయి ఫాలోవర్స్, ఛాన్సులు సాధించి బాగానే పాపులర్ అవుతుంది. ఆల్రెడీ ఆర్జీవీఅమ్మాయి వీడియోలు పోస్ట్ చేసి వైరల్ చేయగా ఇప్పుడు హీరోయిన్ చేసి టాలీవుడ్ లో వదిలితే మరింత పాపులర్ అవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: