సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కు ఉన్న మాస్ ఇమేజ్ మరే దక్షిణాది భాషల హీరోలకు లేదనడంలో సందేహం లేదు. 60సంవత్సరాలులు దాటినప్పటికి ఇప్పుడున్న హీరోలతో సమానంగా ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ చెప్పి ప్రేక్షకుల్ని మెప్పిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. ఈ టాలీవుడ్ స్టార్ హీరో అంటే సౌత్ లోనే కాదు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది స్టార్స్ కి ఇష్టం. ఇదిలావుండగా  నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్న ఎన్‌బీకే 109 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఎన్‌బీకే 109 సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడీగా మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటిస్తున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో 60కి వయసు పైబడిన హీరోలకి హీరోయిన్లు దొరకడం కష్టమైంది. అందుకే ఈసారి ఎన్‌బీకే 109 టీమ్ సరికొత్తగా ఈ ప్రయోగం చేస్తుందని మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఈ విషయం ఇలా ఉండగా పెళ్లయిన తర్వాత నటి ఐశ్వర్య రాయ్ పూర్తీ స్థాయిలో సినిమాలపై దృష్టి సారించలేకపోయింది. ఈ క్రమంలో అడపాదడపా చిత్రాల్లో గెస్ట్ అప్పీయరెన్స్, కామియే అప్పియరెన్స్ తదితర పాత్రల్లో కనిపించింది. కానీ ఆ మధ్య ప్రముఖ తమిళ్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించింది. ఈ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి.ఇదిలా ఉంటే యన్ బి కే 109 ని సంక్రాంతి బరిలో నిలపాలని ఫిక్స్ అయ్యారట. నిర్మాత నాగవంశీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో యన్ బి కే 109 ని జనవరి 12 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా పీలర్లు వదులుతున్నారు.ఇప్పటికే యన్ బి కే 109 లో బాలయ్య పవర్ ఫుల్ లుక్ మాత్రమే కాదు మార్చ్ లో విడుదల చేసిన గ్లిమ్ప్స్ అన్ని అభిమానులనే కాదు మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది. ఇక దసరా కు యన్ బి కే 109 టైటిల్ రివీల్ చెయ్యడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనే టాక్ వినబడుతుంది. విజయదశమి రేపే.. మరి యన్ బి కే 109 నుంచి ఏ సర్ ప్రైజ్ అభిమానులకు అందుతుందో.. ప్రస్తుతం అయితే యన్ బి కే 109 చిత్రం జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా విడుదల చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారనే మాట గట్టిగానే వినబడుతుంది. చూద్దాం ఆ డేట్ ఎప్పుడు రివీల్ చేస్తారో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: