అయితే విజయదశమి సందర్భంగా తాము నిర్మించిన లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్లో నాగ వంశీ కి దేవర కలెక్షన్స్ గురించి మీడియా మిత్రులు చాలామంది ప్రశ్నించారు. దేవర కలెక్షన్స్ విషయంలో మీరు హ్యాపీగానే ఉన్నారా అని ఒక మీడియా మిత్రుడు ప్రశ్నించారు.. అలాగే ఇది ఒక ఫేక్ కలెక్షన్ అని ప్రచారం కూడా జరుగుతోంది.. కాస్త ఎక్కువ వేసి చెబుతున్నారంట నిజమేనా అని అడగగా.. తన దగ్గరకు వచ్చిన కలెక్షన్స్ ఉన్నవి ఉన్నట్టుగానే చెప్తానని.. తాను డబ్బులు వచ్చాయని చెబుతున్న మీడియా నమ్మడం లేదు కాబట్టి వారు నమ్మితేనే తాను కూడా వచ్చినట్టు ఫీల్ అవుతానని తెలియజేశారు నాగ వంశీ.
అంతేకాకుండా ఇలా కలెక్షన్స్ ప్రతిరోజు విడుదల చేయాల్సిన అవసరం ఉందా.. అంటూ మరొక ప్రశ్న అడగగా.. ఈ విషయం పైన నాగ వంశీ మాట్లాడుతూ ఇది ఎవరినో ఉద్దేశించి చేయడం కాదని కేవలం హీరోల ఫ్యాన్స్ కోసమే సంతృప్తి పరచడం కోసమే ఇలా కలెక్షన్స్ ని నెంబర్ ని రిలీజ్ చేస్తూ ఉంటామని తెలియజేశారు. దేవర చిత్ర విషయంలో తాను అమ్మిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని వాళ్ళే స్వయంగా తెలియజేశారని వాళ్లు హ్యాపీగా ఉంటే తాను కూడా హ్యాపీగానే ఉంటారని తెలియజేశారు నాగ వంశీ. ఎట్టకేలకు ఇక రూమర్లకు చెక్ పెట్టారని చెప్ప వచ్చు.