కొరటాల శివ పోస్టర్ తోనే వర సీక్వెల్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో ఫ్యాన్స్ ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారని చెప్పేశారు. దేవర సీక్వెల్ లో గెస్ట్ రోల్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని బాలీవుడ్ స్టార్స్ ను ఈ గెస్ట్ రోల్స్ కోసం తీసుకోనున్నామని కొరటాల శివ చెప్పుకొచ్చారు. దేవర సీక్వెల్ ను గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
మరోవైపు దేవర సినిమాకు శాటిలైట్ ఇంకా పూర్తి కాకపోవడం అభిమానులను బాధ పెడుతోంది. దేవర సినిమా శాటిలైట్ వేగంగా పూర్తి చేస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. దేవర శాటిలైట్ హక్కులను ఏ ఛానల్ సొంతం చేసుకుంటుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది.
దేవర సినిమా రిజల్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు సైతం పూర్వ వైభవం తెచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర2 2027 లోపే కచ్చితంగా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. దేవర2 విషయంలో ఎలాంటి మార్పులు చేస్తారో చూడాల్సి ఉంది. దేవర సీక్వెల్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. దేవర సీక్వెల్ లో యాక్షన్ బ్లాక్స్ విషయంలో మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకోనున్నారని భోగట్టా.