ప్రేక్షకులను అలరించడం కోసం చాలామంది సెలబ్రెటీలు కొన్నిసార్లు చేసిన మేకోవర్ చూస్తే అందరిని ఆశ్చర్యపరిచేలా కనిపిస్తూ ఉంటుంది. సినిమాల కోసమే జుట్టు గడ్డాన్ని పెంచుకోవడమే కాకుండా మరికొంతమంది సిక్స్ ప్యాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్స్ కూడా పాత్రలకు తగ్గట్టుగా మారిపోయి మరి నటిస్తూ ఉండడం గమనార్హం. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాటి గురించి పూర్తిగా చూద్దాం.




మొదటిసారి షార్ట్ ఫిలింలతో తన కెరియర్ ని మొదలుపెట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా మారి మంచి క్రేజీ అందుకున్నారు. అలా వచ్చిన అవకాశానాల్ల ఉపయోగించుకొని ప్రస్తుతం యంగ్ హీరోగా పేరు సంపాదించిన రాజ్ తరుణ్.. ఈ ఏడాది పురుషోత్తముడు, తిరగబడరా సామి, బలే ఉన్నాడు అని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సక్సెస్ అందుకోలేకపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ రామ్ భజరంగ్  సినిమాల నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో ఎవరు ఊహించని పాత్రలో కనిపించడం కోసం తన మేకోవర్ని మార్చేశారు రాజ్ తరుణ్.


రా అండ్ రష్టిక్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ చాలా మాస్ చేంజింగ్ గా కనిపిస్తోంది. డైరెక్టర్ సుధీర్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈ చిత్రం మల్టీ స్టార్లర్గా తీయబోతున్నారట. ఇందులో మరొక నటుడు సందీప్ యాదవ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజ్ తరుణ్ నోట్లో బీడీ లుంగీ పూల చొక్కా కట్టుకొని మరి కనిపిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సందీప్ యాదవ్ లుక్స్ కూడా చాలా డిఫరెంట్ గానే ఉంటున్నాయట. ఇప్పటివరకు లవర్ బాయ్గా కనిపించిన రాజ్ తరుణ్ మరి పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న ఈ చిత్రంలో రోల్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. సిమ్రాత్ కౌర్, సాట్నా  హీరోయిన్స్ గా నటిస్తున్నారట.ఈ ఫోటోలు చూసి అభిమానులు రాజ్ తనని గుర్తుపట్టలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: