గోపీచంద్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తోంది. తాజాగా విశ్వం సినిమాతో గోపీచంద్ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలం మారుతోందని గోపీచంద్ మాత్రం మారట్లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ ఫ్యాన్స్ బాధ మామూలుగా లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
గోపీచంద్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో భారీ విజయాలను సొంతం చేసుకోవడం కష్టమనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఈ కామెంట్ల విషయంలో గోపీచంద్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. గోపీచంద్ ఇకనైనా మారకపోతే ఆయన ఖాతాలో మరిన్ని ఫ్లాపులు చేరే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గోపీచంద్ పారితోషికం పరిమితంగానే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విశ్వం సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. గోపీచంద్ తర్వాత సినిమాల విషయంలో అయినా జాగ్రత్త పడకపోతే మాత్రం కెరీర్ ముగిసినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. గోపీచంద్ సున్నా సెంటిమెంట్ కూడా సినిమాలకు వర్కౌట్ కావట్లేదు. గోపీచంద్ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోలను చూసి అయినా మారితే మంచిదని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.