సాధారణంగా రామ్ చరణ్ హీరోయిన్స్ తో ఎక్కువగా మింగిల్ అవ్వడు . తన పని తాను చూసుకొని పోతూ ఉంటాడు. అది మెగా పెంపకం .. మెగాస్టార్ చిరంజీవి - సురేఖ అలా పద్ధతిగా పెంచారు . అంతేకాదు ఎప్పుడు హీరోయిన్స్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కూడా లేదు . అసభ్యకరంగా ప్రవర్తించినట్లు దాఖలాలు లేవు . రామ్ చరణ్ చాలా పద్ధతిగా ఉంటాడు అంటూ పలువురు హీరోయిన్స్ కూడా తనతో వర్క్ చేసిన వాళ్ళు ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు . అయితే రామ్ చరణ్ ఓ  హీరోయిన్ విషయంలో మాత్రంలో హద్దులు మీరిపోయాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు "కాజల్ అగర్వాల్".


వీళ్లిద్దరూ కలిసి మొదటగా "మగధీర" అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.  అంతేకాదు హీరోగా రామ్ చరణ్ కు ..హీరోయిన్ గా కాజల్ కి ఒక స్పెషల్ స్టేటస్ ని ఇచ్చింది . అయితే ఈ సినిమా మూమెంట్లోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం బాగా ఏర్పడి అది లావ్ గా కూడా మారింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించేవి.  కాగా ఈ సినిమా షూటింగ్ టైంలో వీళ్లిద్దరి మధ్య చనువు పెరిగి చాలా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారట . అంతేకాదు రామ్ చరణ్.. కాజల్ అగర్వాల్ ని చాలా ఫన్నీగా కూడా ఆటపట్టించేవాడట.



కాజల్ మొదటి నుంచి ఎక్కువగా స్వీట్స్ తింటుందట . సినిమా షూట్ లో కూడా ఎక్కువగా స్వీట్స్ తింటూ వచ్చిందట.  ఒకరోజు ఆమె ఎక్కువగా స్వీట్ లు తినడం చూసిన చరణ్ కాజల్ ని ఫూడీ అంటూ బాగా ఏడిపించాడట . సినిమా షూట్ జరుగుతున్నంత సేపు కూడా చరణ్.. కాజల్ ని అలాగే ఫన్నీగా ఏడిపిస్తూ వచ్చాడట . అంతేకాదు ఒకానొక సమయంలో కాజల్ కూడా చరణ్ ఆటపట్టించే విధానానికి బాగా హర్ట్ అయిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ హాట్ గా ట్రెండ్ అయింది . అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో చరణ్ - కాజల్ బాగా సందడి చేయడంతో ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయారు . అంతేకాదు ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.  మరి ముఖ్యంగా గోవిందుడు అందరివాడేలే  సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి బాగా మంచి మార్కులు పడ్డాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: