సుకుమార్ ...టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ . జగడం సినిమా ఫ్లాప్ అయినా సరే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు . ప్రజెంట్ సుకుమార్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అల్లు అర్జున్ కెరీర్ నే కాదు సుకుమార్ కెరియర్ ని కూడా ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్ళి పోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . పుష్ప సినిమా తర్వాత సుకుమార్ కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .


అయితే నిజానికి సుకుమార్ పుష్ప సినిమా కథను రాసుకున్నప్పుడు మొదటగా హీరోగా చాలామంది హీరోలను అనుకున్నారట . అయితే వాళ్లలో మొదటగా మహేష్ బాబుని హీరోగా అనుకున్నారట . నిజానికి పుష్ప సినిమాకి మహేష్ బాబు ఫిజిక్ కి ఏం మాత్రం సూట్ కాదు . మరి సుకుమార్ ఏ ఉద్దేశంతో అలా ఊహించుకున్నాడో ఆయనకే తెలియాలి.  అంతేకాదు మహేష్ బాబుకి ఆ కథను కూడా వివరించారట . ఓ రో  మహేష్ బాబు కొన్ని షెడ్యూల్స్ లో బిజీగా ఉన్న కారణంగా ఆ కథను ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్లి మరీ వినిపించారట .


అలా ఇలా కథ చెప్పుకునేసరికి రాత్రి అయిపోయిందట . అంతేకాదు అప్పుడే డిన్నర్ చేస్తూ ఈ స్టోరీ గురించి చర్చించుకుంటూ సుకుమార్ కు సున్నితంగా నో చెప్పాడట మహేశ్ బాబు. "ఈ కథ నాకు సూట్ కాదు "అంటూ మహేష్ బాబు వెంటనే నో చెప్పేసారట . మహేష్ బాబు నిర్ణయమే కరెక్ట్.  ఈ సినిమా ఆయన కి సూట్ అయ్యేదే కాదు . ఆరోజు సుకుమార్ టైం బాగుంది . ఒకవేళ అటు ఇటుగా మహేష్ బాబు ఈ సినిమాను ఒప్పుకొని ఉంటే డిజాస్టర్ కా బాప్ అనే సినిమాను అటు మహేష్ బాబు ఇటు సుకుమార్ తమ ఖాతాలో వేసుకోవాల్సి వచ్చుండేఅది. ఆ దేవుడు కరుణిచ్చాడు , సుకుమార్ అలా తప్పించుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: