- బాబాయ్ .. అబ్బాయ్ తో జోడీ క‌ట్టిన శృతీ హాస‌న్
- బాల‌య్య‌కు వీర‌సింహా రెడ్డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్
- జూనియ‌ర్ ఎన్టీఆర్ కు రామ‌య్యా వ‌స్తావ‌య్యా లాంటి ప్లాప్‌


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


బాలయ్య బాబు - జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు బాబాయ్, అబ్బాయిలు అవుతారు. మరి ఒక హీరోయిన్ బాబాయ్ బాలయ్యకు న్యాయం చేయడమేంటి..? అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్‌కు అన్యాయం చేయటం ఏంటి..? ఆ హీరోయిన్ ఎవరు..? అనుకుంటున్నారా ? ఈ తరం స్టార్ హీరోయిన్లలో చాలామంది స్టార్ హీరోయిన్లు లక్కీ. అటు సీనియర్ హీరోలతో పాటు.. ఇటు యంగ్ జనరేషన్ హీరోలతో కలిసి నటిస్తున్నారు. ఈ క్రమంలోనే బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఒక హీరోయిన్.. బాలకృష్ణకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం ఫ్లాప్‌ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు.. సీనియర్ హీరో లోక నాయకుడు కమలహాసన్ కుమార్తె శృతిహాసన్.


బాలయ్యతో కలిసి నటించిన వీర సింహారెడ్డి సినిమా గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాలయ్య కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే 2013లో ఇదే శృతిహాసన్.. జూనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా రామయ్య వస్తావయ్యా సినిమాలో నటించింది. హరీష్‌ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాల అందుకోలేదు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌. అయితే అప్పట్లోనే ఈ సినిమా రూ.35 కోట్ల షేర్ సాధించింది. శృతిహాసన్, బాలయ్యకు అదిరిపోయే హిట్ ఇస్తే.. అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం ఒక బిలో యావరేజ్‌, ప్లాప్ సినిమా ఇచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: