అయితే ఇదే క్రమంలో ఐశ్వర్య , అభిషేకు సంబంధించిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది . దీంతో మరోసారి విడాకులు మేటర్ టాప్ లోకి వచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో .. గతంలో ప్రో కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఐశ్వర్యరాయ్ తన ఫ్యామిలీ తో కలిసి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారు . ఆమె వెంట భర్త అభిషేక్ బచ్చన్ , కూతురు ఆరాధ్య బచ్చన్ అలాగే నవ్య నవేలి నంద కూడా ఉన్నారు . అదే సమయంలో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ మధ్య గొడవ జరిగింది .
ఇద్దరు వాదించుకుంటూ కనిపించారు . ఇక దీంతో విడాకులకు సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది . అయితే అభిషేక్ బచ్చన్ తో వాదన తర్వాత ఐశ్వర్య సైలెంట్ అయ్యారు. ఇక తర్వాత నవ్య నవేలి నందా కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నించి సైలెంట్ అయ్యారు. అక్కడితో ఆ వీడియో కంప్లీట్ అయింది . కాగా వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనేది వీడియోలో అర్థం కాలేదు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతూ స్పందిస్తున్నారు.