ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమాలకు నిర్మాతలు పెట్టిన బడ్జెట్ వస్తే చాలు రా బాబు అనుకుంటున్నారు .. ఇలాంటి సమయంలోనే కొన్ని సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి . ఇక మరీ ముఖ్యంగా 2024 ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .. అయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే కొన్ని సినిమాల కారణంగా ఈ సంవత్సరం లాభాల సంవత్సరంగా మారిపోయింది. అలాగే నిర్మాతన్ని లాభాల్లో ముంచిన‌ సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

 
ముందుగా బాలీవుడ్ విషయాని కొస్తే సౌత్ సినిమాల దెబ్బకి బాలీవుడ్ హీరోల మైండ్ దొబ్బింది. వారు ఎలాంటి సినిమాలు తీసిన అక్కడ వారికి కలిసి రావట్లేదు. ఇలాంటి క్రమంలో హిందీలో స్త్రీ2 సినిమా విడుదలై భారీ లాభాలు తెచ్చిపెట్టింది. రూ. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టి నిర్మాతలకు  బయ్యర్ల కు పంట పండించింది.  అలాగే మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మంజుమల్ బాయ్స్‌ కూడా రూ.100 కోట్లకు పైగా లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలో ఉంది.


ఇక మన టాలీవుడ్ నుంచి హనుమాన్ మూవీని తీసుకోండి రూ.25 కోట్లతో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. బాహుబలి, త్రిబుల్‌  ఆర్ తర్వాత రూ. 100 కోట్లకు పైగా లాభాలు తెచ్చి పెట్టిన సినిమా కూడా ఇదే. ఇక దీని తర్వాత కల్కి సినిమా వచ్చింది.. ఈ మూవీకి కూడా రూ. 200 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. కేవలం బాలీవుడ్‌లోనే కాదు .. ఇండియాలోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో స్త్రీ 2 టాప్‌లో ఉంది. ఇక మలయాళంలో మంజుమ్మల్ బాయ్స్ కూడా అంతే. 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. 242 కోట్లు కలెక్ట్ చేసి 150 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. ప్రేమలు సినిమా కూడా అంతే. 4 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి 140 కోట్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: