గత కొద్దిరోజులుగా బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. అది కూడా అఖండ-2 అని అందరూ అనుకున్నారు.. కానీ తాజాగా 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పైన బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా BB4 అనే వర్కింగ్ టైటిల్ తో నాలుగవ సినిమా అని ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ రోజు. ఇక తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ ఇస్తూ ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని అక్టోబర్ 16వ తేదీన చేయబోతున్నట్లు ప్రకటించారు.
త్వరలోనే షూటింగ్ మొదలు పెడతామని రిలీజ్ చేసిన పోస్టర్లో BB4 అనే వర్కింగ్ టైటిల్ పెట్టి ఆ టైటిల్ వెనుక అమ్మవారి ఫోటోతో హైలెట్ చేస్తూ చూపించారు. దీంతో ఇది కచ్చితంగా అఖండ-2 సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ పోస్టర్ చూసిన బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. బోయపాటి శ్రీను మరొకసారి తమ హీరోని ఎలా చూపిస్తారో అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి ఫోటో ఉండడంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో నటీనటులు ఎవరనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి దసరా పండుగకి మాత్రం బాలయ్య అభిమానులకు ఒక అదిరిపోయి గుడ్ న్యూస్ చెప్పారు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబి తో ఒక సినిమా చేస్తూ ఉన్నారు