మహేష్ హైదరబాద్ లో ఉంటాడు . నమ్రత ముంబైలో ఉంటుంది. వీళ్లిద్దరూ కలుసుకోవడం చాలా చాలా కష్టం . "వంశీ" సినిమా షూట్ అయిపోయాక వీళ్లిద్దరు కలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయిందట. ఆ టైంలో ఎలాగోలా మహేష్ బాబుని ఇంట్లో మస్కా కొట్టి మరి నమ్రతను కలుసుకోవడానికి ముంబై వెళ్లేవారట . అయితే ప్రేమ పిక్స్ కి వెళ్లి ఇక పెళ్లి చేసుకోవాలి అని నమ్రత - మహేష్ డిసైడ్ అయ్యారట . అదే మూమెంట్లో నమ్రత బర్త డే రావడం.. నమ్రత సరదాగా బెట్ వేయడం అప్పట్లో మహేష్ బాబుకి గెలవడం హైలైట్ గా మారింది .
నమ్రత తన బర్త్డ డే కి ముంబైలో ఉంది . మహేష్ బాబు హైదరాబాద్ లో ఉన్నాడు . ఒక ఇంపార్టెంట్ సినిమా షూటింగ్లో బిజీ గా ఉన్నాడు. ఈవినింగ్ అయితే గాని షూటింగ్ కి ప్యాకప్ చెప్పరు. అయితే నమ్రత మాత్రం మహేష్ బాబును కలవాలి అనుకునింది . తనని పర్సనల్గా విష్ చేయాలి అనుకున్నాది. " నువ్వు నా బర్త్ డే లోపు విష్ చేస్తే ముద్దు పెడతాను అంటూ కండిషన్ పెట్టిందట". మహేష్ బాబు షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ వెంటనే హైదరాబాద్ నుంచి ముంబైకి ప్లైట్ బుక్ చేసుకుని మరి అర్ధరాత్రి ఆమె ఇంటి గోడ దూకి మరి బెట్ విన్ అయ్యాడట. మహేష్ బాబు - నమ్రత విషయంలో చాలా చాలా జెన్యూన్ అంటూ అప్పట్లో జనాలు మహేష్ బాబును బాగా మెచ్చుకున్నారు . ఆ తర్వాత కృష్ణ కి ఇష్టం లేకపోయినా సరే మహేష్ బాబు - నమ్రతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు . ఆఖరికి కుటుంబ సభ్యులే వాళ్లకు ఇష్టం లేకపోయినా సరే వీళ్ళిద్దరి పెళ్లి జరిపించారు. ప్రజెంట్ ఈ జంట ఇద్దరు పిల్లలతో చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!